![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -376 లో.. ఆదర్శ్ ముకుంద దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. సారీ అని ఆదర్శ్ చెప్పగానే ఎందుకని ముకుంద అడుగుతుంది. నిన్ను అపార్థం చేసుకొని ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను కద.. అలోచించి ఉంటే బాగుండేదని ఆదర్శ్ అంటాడు.
నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను.. ఆ విషయం మురారికి చెప్పాను. నీ ఫోటో చూడగానే మురారి తన ప్రేమని త్యాగం చేసి.. నిన్ను పెళ్లికి ఒప్పించి మన ఇద్దరి పెళ్లి చేసాడని ఆదర్శ్ తన ప్రేమ గురించి ముకుందకి చెప్తాడు. నిన్ను మర్చిపోలేక ఇన్ని రోజులు నరకం అనుభవించాను కానీ నువ్వు నాకోసం ఎదరు చూస్తున్నావని తెలిసి వచ్చానని ఆదర్శ్ చెప్తుంటే.. ముకుంద మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. జర్నీ చేసావ్ కదా టైడ్ అయ్యావ్.. ఫ్రెషఫ్ అయి రా అని ముకుంద చెప్పగానే ఆదర్శ్ వెళ్తాడు. ఆ తర్వాత తనపై ఆదర్శ్ చూపించే ప్రేమని ముకుంద చూసి భయపడుతుంది. అదేసమయంలో కృష్ణ దగ్గరికి మురారి వచ్చి.. నువ్వు చాలా గ్రేట్.. నాకు ఏసీపీగా కంటే కృష్ణ మొగుడు అనే ప్రౌడ్ గా ఉందని మురారి చెప్తాడు. ఆదర్శ్ వచ్చాకే శోభనం అన్నావ్ కదా అని రొమాంటిక్ గా కృష్ణ దగ్గరకి వస్తుంటే.. ముహూర్తం పెట్టాకే అంటు మురారి చెంపపై కృష్ణ ముద్దు పెట్టి వెళ్లిపోతుంది. అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. మాటల్లో తింగరి అని కృష్ణని రేవతి అంటుంటే.. నేను ఇప్పుడు తింగరిని కాదు. ఇప్పుడు నేను పెద్ద పెద్ద పనులు చేసానని కృష్ణ అంటుంది. అప్పుడే వస్తున్న భవాని చూసి.. నువ్వు ఎప్పుడు తింగరివే అంటుంది. అలా అనగానే అందరు నవ్వుకుంటారు.
ఆ తర్వాత కృష్ణ అంటు మురారి గట్టిగా అరుస్తుంటాడు. అక్కడ అందరు ఉండడం చూసి ఆగిపోతాడు. ఏంటి ఎదో చెప్పబోయ్యవని మురారిని అందరు అడుగుతారు. కృష్ణకి సంబంధించిన తింగరి పని చెప్పగానే అందరు నవ్వుకుంటరు. ఆ తర్వాత ఆదర్శ్ కి భవాని భోజనం వడ్డీస్తుంటుంది. అది చూసి ముకుంద వడ్డీస్తే నాకు చూడాలని ఉందని కృష్ణ అంటుంది. కానీ అదేం పట్టించుకోకుండా ఆదర్శ్ కి భవాని భోజనం వడ్డీస్తూ, ప్రేమగా తినిపిస్తుంది. తరువాయి భాగంలో.. నా ప్రేమని ఎలా మర్చిపోవాలని ముకుంద అనుకుంటు ఉండగా.. వెనకాల నుండి ఆదర్శ్ వచ్చి ముకుందపై చెయ్యి వేస్తాడు. దాంతో ముకుంద భయపడుతు అరుస్తుంటే అందరూ వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |